సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామంలో, గురువారం మధ్యాహ్నం టిడిపి ప్రచార రథం పై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు, దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గొట్టిపాటి, రాష్ట్రంలో వైసీపీ ఓటమి భయంతోనే ప్రతిపక్షాల పై దాడులకు తెగబడుతున్నారని, వైసిపి నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టం గా మారుస్తున్నారని, ప్రచార రథంపై దాడి దుర్మార్గపు చర్య అని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు,