బాపట్లలో పింగళి వెంకయ్య 148వ జయంతి

60చూసినవారు
బాపట్లలో పింగళి వెంకయ్య 148వ జయంతి
జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి తెలుగు వారి ఖ్యాతి ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన మహనీయుడు పింగళి వెంకయ్య అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి సాయిబాబు అన్నారు. శుక్రవారం పింగళి వెంకయ్య148 జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతి అస్తిత్వానికి మనుగడకు మూలస్తంభమైన త్రివర్ణ పతాకం అందించిన ఆయన చిరస్మరణీయుడని కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్