చీరాల ఎమ్మెల్యే కొండయ్య అవినీతికి పాల్పడుతున్నట్లు సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై టిడిపి యుద్ధం ప్రకటించింది. గత3 రోజులుగా సాక్షి ప్రతులను తగులబెట్టే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తోంది. మంగళవారం చీరాల లోని ఎం. జి. సి మార్కెట్ వద్ద వైశ్యులు, ఈపూరుపాలెం, అక్కయ్యపాలెంలలో టిడిపి శ్రేణులు సాక్షి ప్రతులను తగలబెట్టారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొండయ్య మాత్రం తనకేమీ పట్టనట్లున్నారు.