చీరాలలో శనివారం రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చీరాల ఆర్వోబి పై భైకును కారును ఢీకొన్న సంఘటనలో లక్ష్మీపురానికి చెందిన రాము అనే యువకుడికి గాయాలయ్యాయి. పేరాల చినరథం సెంటర్‌లో లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి కాలు పూర్తిగా విరిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటురు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.