పేద విద్యార్థులకు చేయూతనిస్తా: ఎమ్మెల్యే కొండయ్య

60చూసినవారు
పేద విద్యార్థులకు చేయూతనిస్తా: ఎమ్మెల్యే కొండయ్య
రాజకీయాల్లోకి రాక ముందు నుండి విద్యారంగంలో ఉన్న తాను పేద విద్యార్థులకు తన వంతు చేయూతనందిస్తానని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చెప్పారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన 50 మంది పేద విద్యార్థులకు సైకిళ్లను, నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ఫ్రీ సీటు సాధించిన బూదాటి మాక్షిక కు సెల్ ఫోన్ అందజేశారు. రోటరీ ప్రముఖులు మామిడాల శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, పోలుదాసు రామకృష్ణ, బి. హేమంత్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్