Feb 25, 2025, 03:02 IST/
నటి శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట
Feb 25, 2025, 03:02 IST
నటి శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో సహా పలువురిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో శ్రీరెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది.