దర్శి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24, 2024-25 విద్యా సంవత్సరంకు సంబంధించి గురువారం ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ కమిటీ అడ్వైజర్స్ రాజేష్, శ్రీకాంత్ కళాశాలలోని అన్ని విభాగాల రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు కళాశాలకు బి గ్రేడ్ కేటాయించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ప్రభుదాస్, ఐక్యుఏసి కోఆర్డినేటర్ ప్రవీణ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.