దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఏడాది పూర్తైన సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. YCP పాలనలో దలితులను చంపి డోర్‌డెలివరీ చేసిన దారుణ ఘటనలు జరిగాయని ఆరోపించారు. అమరావతి మహిళల్ని కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆగస్ట్ 15న ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందన్నారు.