దర్శి: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

78చూసినవారు
దర్శి: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ముండ్లమూరు మండలం తమ్మలూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 70 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు ముండ్లమూరు ఎస్సై నాగరాజు తెలిపారు. వినుకొండ నుండి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా సమాచారం. ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై చెప్పారు.

సంబంధిత పోస్ట్