దర్శి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా డిగ్రీ కళాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ ఎన్. వి రమణ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. హైసన్ ఎక్స్పీరియన్స్, డిమార్ట్ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారని, ఇంటర్ నుండి పిజి వరకు చదువుకున్న 19 నుండి 29 ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.