రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈనెల 30వ తేదీన దర్శిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కవిత తెలిపారు. దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్ మేళాలో 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు 19 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.