దేశవ్యాప్తంగా జులై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. హనుమంతరావు కోరారు. సంబంధిత కరపత్రాలను దర్శిలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.