నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో గురువారం దొంగలు రెచ్చిపోయారు. రావినూతల సురేష్ అనే వ్యక్తి ఇంట్లో డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.