కొందరు తన తల్లిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'జడ్పీ ఛైర్మన్ పదవికి ఎసరు అని వార్తలు రాస్తున్నారు. జడ్పీటీసీలు అందరూ మా వెంటే ఉన్నారు. మేమే ఏదో భయపడి వాళ్లను టూరు తీసుకెళ్ల లేదు. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే టూర్క వెళ్లామని ఎన్నికలకు ముందే వాళ్లకు చెప్పాను. ఎన్ని చేసినా మా అమ్మను జడ్పీ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగించలేరు' అని ఆయన అన్నారు.