దర్శి: మను సంస్కృతి పత్రాలను తగలబెట్టిన ప్రజా సంఘాలు

74చూసినవారు
దర్శి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రాష్ట్ర దళిత సేవా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను సంస్కృతి పత్రాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు గోవింద ప్రసాద్ మాట్లాడుతూ దళితుల నీడను తాకితే మైలు పడుతుందనే సమాజం నుండి డాక్టర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల ద్వారా ఈరోజు దళితులు తలెత్తుకుని తిరుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్