దర్శి పట్టణంలో భారీ తిరంగ జెండాతో ర్యాలీని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. 100 అడుగుల జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీలో భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో దర్శి పట్టణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.