దర్శి మండలం పోతవరం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా తహసిల్దార్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రెవిన్యూ సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న ఆర్జీల రూపంలో ఇక్కడ తెలుపవచ్చని, వాటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.