కురిచేడు పట్టణంలో ఎస్సై శివ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై వాహనాలను పరిశీలించి వాహనాలకు సంబంధించిన దృవీకరణ పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మద్యం, నిషేధిత వస్తువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.