ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి తెలంగాణలో గురువారం గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు.భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా నాగారం శివారులో ఒక కారు ఆగి ఉన్నది. పోలీస్లు ఆ కారు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని గమనించగా అతను చనిపోయి ఉన్నాడు. గాయాలు లేకపోవడంతో గుండెపోటు కారణంగా మృతి చెందాడని భావిస్తున్నారు. అతనిని దర్శి మండలానికి చెందిన బండారి కృష్ణగా గుర్తించారు.