తాళ్లూరు మండలం సోమవారపాడు, తూర్పు గంగవరం గ్రామాలలోని గుంటి గంగాభవాని అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాట్లను పోలీస్ బందోబస్తును సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు.