సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ తెలిపారు. ముండ్లమూరు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో బుధవారం డిఎస్పి లక్ష్మీనారాయణ సైబర్ నేరాలపైననేరాలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీడిఎస్పి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్స్ పైఫోన్లపై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరాలకు ఎక్కువమంది గురైతున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించిన లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు.