ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో ప్రపంచ కప్ సాధించటంతో అసాధారణ ప్రతిభ కనపరిచిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం పోతిరెడ్డి శివారెడ్డిని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గొట్టపాటి లక్ష్మి, టిడిపి నాయకులు కడియాల లలిత్ సాగర్ లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి కుటుంబ సభ్యులు, టిడిపి జనసేన, నాయకులు పాల్గొన్నారు.