జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన దొనకొండ విద్యార్థిని

76చూసినవారు
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన దొనకొండ విద్యార్థిని
దొనకొండ మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న ఏనుబరి ప్రైజి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈనెల 21, 22వ తేదీలలో కర్నూలు డీఎస్సీ స్టేడియం లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ పోటీలలో ప్రతిభ చూపటంతో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికైనట్లుగా ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రైజి ని మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్