వెలిగండ్ల మాజీ సర్పంచ్ కారంపూడి కృష్ణమూర్తి బుధవారం రాత్రి ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం ఆయన స్వగృహమైన వెలిగండ్లలో మృతదేహాన్ని పలువురు రాజకీయ పార్టీల నేతలు సందర్శించి నివాళులు అర్పించారు. అలాగే వారి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.