గ్రేడ్ -2 గా దర్శి నగర పంచాయతీ

74చూసినవారు
గ్రేడ్ -2 గా దర్శి నగర పంచాయతీ
దర్శి నగర పంచాయతీ ఇకపై గ్రేడ్ - 2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయినట్లుగా నగర పంచాయతీ కమిషనర్ మహేష్ బుధవారం తెలిపారు. 2021 వ సంవత్సరంలో దర్శి నగర పంచాయతీగా అప్ గ్రేడ్ కాగా, ప్రస్తుత నగర జనాభా, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దర్శి నగర పంచాయతీని గ్రేడ్ - 2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసింది. దీంతో మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి.

సంబంధిత పోస్ట్