జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘం నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కురిచేడులో స్థానిక సంఘాల నాయకులు ప్రచార రథంతో ప్రచారం నిర్వహించారు. పనిగంటలు తగ్గించడంతోపాటు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలానే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.