దర్శి నియోజకవర్గంలోని పెద్ద ఉల్లగల్లు, పసుపుగల్లు గ్రామాలలో బుధవారం జరుగుతున్న ఉపాధి హామీ పనులను పిడి జోసఫ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేసే సమయంలో మంచినీళ్లు, మజ్జిగ, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, రోజువారి కూలీలకు 307 రూపాయలు అందుకునే విధంగా మెట్లు మ్యాపింగ్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి లలిత కుమారి, ఎంపీడీవో పి సునీత, ఏపీఓ వెంకట్రావు, కూలీలు పాల్గొన్నారు.