ముండ్లమూరు మండలంలోని ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు ఈదురుగాలికి బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న, వరి, పొగాకు, దెబ్బతిని రైతులు నష్టపోయారు. మండల రైతు సంఘం నాయకులు రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు లక్షల్లో పెట్టుబడి పెట్టి వర్షం వల్ల పూర్తిగా నష్టపోయామని వారికి వివరించారు. రైతులను ఆదుకోవాలని ముండ్లమూరు మండల కమిటీ, మండల వ్యవసాయ అధికారికి దీనిపై బుధవారం వినతి పత్రం అందించారు.