తాళ్లూరు మండలం గుండి గంగమ్మ జాతర తిరునాళ్ళ సోమవారం ఘనంగా నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తాను హాజరు అవుతున్నట్లుగా ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.