దర్శి మండల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షునిగా అంకాల శ్రీనును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.