తాళ్లూరు మండలం బెల్లంకొండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించబడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నియామకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.