తాళ్లూరు మండలంలోని బొద్దీకురపాడు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి దేవాలయంలో శుక్రవారవైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. తెల్లవారుజామున నుండి భక్తులు స్వామివారిని, అమ్మవార్లను, ఉత్తర ద్వారా దర్శన్ తీసుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవ స్వామి ఉత్సవమూర్తులకు, గ్రామోత్సవం లో గ్రామ వీధి వీధుల్లో నేల తాళాలతో హరే రామ కీర్తనలు చేశారు.