మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కంభం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశామని తెలిపారు. జాతీయ రహదారిపై ఎస్సై నరసింహారావు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగిన ఇద్దరినీ గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిని కోర్టులో ప్రవేశపెట్టి మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని ఎస్ఐ చెప్పారు.