జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గిద్దలూరు వాసి

61చూసినవారు
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గిద్దలూరు వాసి
ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి ఖ్వాజా రహీం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రహీం మేనమామ అయిన 12వ వార్డు మాజీ కౌన్సిలర్ అల్తాఫ్ సహకారంతో ప్రయోజకుడుగా మారాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్. ఎల్. బి విద్యను రహీం అభ్యసించాడు. ఇటీవల పరీక్షలు రాసిన రహీం పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైనట్లుగా కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్