రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

56చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డుపై అడ్డంగా వెళ్తున్న గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ద్విచక్ర వాహనదారుడిని కంభంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. గేదె మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్