ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు గత కొద్దిరోజులుగా నల్లమల అటువైపు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఉగ్రరూపం దాల్చింది. బుధవారం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలోని నీటి గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో ప్రజలను అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.