రాచర్లలో బండలాగుడు పోటీలు

77చూసినవారు
రాచర్లలో బండలాగుడు పోటీలు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. పోటీలలో పాల్గొని విజయం సాధించే ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులను అందజేస్తామని పోటీల నిర్వహకులు వెల్లడించారు. పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్