హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వాహనదారులకు గురువారం కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున బేస్తవారిపేట పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్న వాహనదారులకు సీఐ జరిమానా విధించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితోపాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు.