ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చెన్నుపల్లి గ్రామంలో గురువారం రాత్రి నాటు సారా నిర్మూలన అంశంపై స్థానిక ప్రజలకు ఎక్సైజ్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటు సారా తయారు చేయటం లేదా అమ్మటం చట్టరీత్యా నేరమని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి ప్రజలను హెచ్చరించారు. నవోదయ 2. O కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఐ తెలిపారు.