గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు అంబులెన్స్ లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.