గిద్దలూరు పట్టణంలో జూన్ 14 తేదీన శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేమున్నాం సేవా సమితి అధ్యక్షుడు చల్లా అశోక్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఈ రక్తదార శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహవంతమైన రక్తదాతలు పాల్గొని రక్త దానం చేసి ప్రాణదాతలు కావాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇప్పటివరకు 50 సార్లకు పైగా రక్తదానం చేసినట్లు తెలిపారు.