కొమరోలు: నాటు సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

56చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముత్రాసు పల్లి గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ మరియు పోలీసు వారి ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం ఎక్సైజ్ డిఎస్పి బలరాం హాజరయ్యారు. గిద్దలూరు ఎక్సైజ్ సీఐ జయరావు, కొమరోలు ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నామని డిఎస్పి అన్నారు.

సంబంధిత పోస్ట్