కొమరోలు మండలం ముత్రాసు పల్లిలో ఆదివారం ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లదాడికి దారితీసింది. రాళ్లదాడిలో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడికి సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు ఘర్షణకు కారణమైన మొత్తం 33 మందిపై కేసు నమోదు చేసినట్లు మంగళవారం తెలిపారు. రోడ్డుకు ద్విచక్ర వాహనం అడ్డుపెట్టడం గొడవకు కారణమైందని పోలీసులు తెలిపారు.