కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోని నిర్మాన్యూస్య ప్రదేశంలో ఓ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు నంద్యాల జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. శనివారం నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎస్సై నాగరాజు వెల్లడించారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.