కొమరోలు మండలం దద్దవాడలోని బిఎస్ఎన్ఎల్ టవర్ కు చెందిన రాగి కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ దొంగలను చూసి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దొంగతనానికి ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.