కొమరోలు మండలంలోని అల్లినగరం, బ్రాహ్మణపల్లిలో మంగళవారం స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు గుర్తింపు కార్డులు పొందేందుకు మీ స్థానిక రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఈ గుర్తింపు కార్డుల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె తెలిపారు. కార్డు పొందేందుకు పొలం పాసుపుస్తకం, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అవసరమని చెప్పారు.