కొమరోలు: అదుపుతప్పి లారీ బోల్తా

68చూసినవారు
కొమరోలు మండలం ఎర్ర పల్లి గ్రామ సమీపంలోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై మంగళవారం అదుపుతప్పి ఓ లారీ బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో డ్రైవర్ తో పాటు క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాడిపత్రి నుండి ఒరిస్సాకు అరటిపండ్ల లోడుతో లారీ వెళ్తున్నట్లుగా లారీ డ్రైవర్ తెలిపాడు. నిద్ర మబ్బుతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా స్థానిక ప్రజలు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్