ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రౌతుపల్లి గ్రామంలో శుక్రవారం మిరప పంట పొలాలను హార్టికల్చర్ అధికారిని విష్ణు ప్రియ పరిశీలించారు. ఈ సీజన్ లో మిరప పంటకు సోకే తామర పురుగు నివారణకు రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. మంచి దిగుబడి సాధించాలంటే తామర పురుగు నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి మందులు వాడాలో రైతులకు ఆమె తెలిపారు. పంటల సాగు అంశంలో అనుమానాలు ఉంటే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు.