కొమరోలు: మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభం

56చూసినవారు
కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని మండల విద్యాశాఖ అధికారి వెంకటరత్నం ప్రారంభించారు. కార్యక్రమానికి కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని టిడిపి నాయకులు సంజీవరెడ్డి అధికారులకు సూచించారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్