ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పొట్టి పల్లి గ్రామంలో గత 3 రోజులుగా వేప చెట్టుకు ధారాళంగా పాలు కారుతున్నాయి. గ్రామస్తులు గ్రామంలో శివపార్వతులు వెలిశారని వేప చెట్టుకు విశేష పూజలు చేస్తున్నారు. మోహన్ రెడ్డి వ్యక్తికి చెందిన పొలంలో వేప చెట్టుకు పాలు కారుతున్నట్లు శుక్రవారం స్థానికులు తెలిపారు. పొలం యజమాని తన పొలంలో దేవుడు వెలిశాడని గ్రామస్తులకు విందు కూడా ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.